
ఎళిల్ దర్శకత్వంలో నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారు. మినిమమ్ గ్యారెంటీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎళిల్ ఇంతకు ముందు విజయ్, అజిత్ హీరోలుగా హిట్ చిత్రాలను అందించారు. ఆ మధ్య విష్ణువిశాల్ హీరోగా వేలైయవందుట్టాల్ వందాల్ వెళ్‌లైక్కారన్ చిత్రంతో తన సక్సెస్ కెరీర్‌ను కొనసాగించారు.
తాజాగా జీవీ. ప్రకాశ్‌కమార్ హీరోగా చిత్రం చేయనున్నారు. ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలను నిర్మించిన అభిషేక్ ఫిలింస్ రమేశ్ పి.పిళ్లై సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సంస్థ ఇప్పటికే సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోలుగా శశి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. అది నిర్మాణంలో ఉండగానే ఎళిల్ దర్శకత్వంలో జీవీ హీరోగా మరో చిత్రాన్ని నిర్మించబోతోంది.
ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం చెన్నైలోని దేవాలయంలో నిరాడంబరంగా జరిగాయి. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర వర్గాలు తెలిపారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను మార్చి నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి సత్య.సీ సంగీతాన్ని అందించనున్నారు. ఇది దర్శకుడు ఎళిల్ బాణీలోనే సాగే వినోదభరిత కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment