విశాల్‌తో హన్సిక | Hansika to romance Vishal in Sundar C's next | Sakshi
Sakshi News home page

విశాల్‌తో హన్సిక

Published Thu, Jun 19 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

విశాల్‌తో హన్సిక

విశాల్‌తో హన్సిక

 నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు క్రేజీ నటి హన్సిక రెడీ అవుతున్నారు. వీరి తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మించనుంది. నిజానికి హన్సిక పూజై చిత్రంలోనే విశాల్ జత కట్టాల్సింది. కాల్‌షీట్స్ సమస్య కారణంగా అది కుదరలేదు. విశాల్ ప్రస్తుతం నటిస్తున్న పూజై చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. పాటల చిత్రీకరణకు చిత్ర యూనిట్ విదేశాలకు బయలుదేరనుంది. తదుపరి చిత్రానికి విశాల్ సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌లోనే నిర్మించనున్నారు. దీనికి సుందర్.సి దర్శకత్వం వహించనున్నారు. మరో విషయం ఏమిటంటే సుందర్.సి దర్శకత్వంలో హన్సిక మూడవసారి నటించనున్న చిత్రం ఇది.
 
 ఇంతకుముందు తియవెలై సెయ్యనుం కుమారు రీమేక్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సుందర్.సి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న అరణ్మణై చిత్రంలోను హన్సికనే ప్రధాన హీరోయిన్. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. విశాల్, హన్సికల కాంబినేషన్‌లో సుందర్.సి   ఎంటర్‌టైయినర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం జూలై 9న ప్రారంభం కానుందని తాజా సమాచారం. ఒక కీలక పాత్రలో నటి సిమ్రాన్ నటించనున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement