'హ్యాపి ఎండింగ్తో ముగిసిపోలేదు' | Happy Ending is not the end of my career : Ileana | Sakshi
Sakshi News home page

'హ్యాపి ఎండింగ్తో ముగిసిపోలేదు'

Published Sun, Mar 27 2016 9:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

'హ్యాపి ఎండింగ్తో ముగిసిపోలేదు'

'హ్యాపి ఎండింగ్తో ముగిసిపోలేదు'

ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా, కొద్దిరోజులు అవకాశాల్లేక ఖాళీగా ఉంటుంది. చివరగా సైఫ్ అలీఖాన్ హీరోగా తెరకెక్కిన హ్యాపి ఎండింగ్ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ తరువాత అవకాశాల్లేక మోడల్గా సరిపెట్టుకుంటుంది. అదే సమయంలో సౌత్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సౌత్లో హీరోయిన్గా  సమయంలోనే బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీని తరువాత తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోవటం మానేశారు.

బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కెరీర్ ఆశాజనకంగానే కనిపించినా తరువాత మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న రుస్తుం సినిమాలో లీడ్ రోల్లో నటిస్తుంది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇల్లి బేబి. హ్యాపి ఎండింగ్ సినిమాతో తన కెరీర్ ముగిసి పోలేదన్న ఇలియానా త్వరలోనే 'రుస్తుం'తో మీ ముందుకు వస్తున్నా అంటూ కామెంట్ చేసింది. మరి ఈ సినిమాతో అయినా ఇలియానా కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement