కేపీసీ@365 | hero chiranjivi new movie started | Sakshi
Sakshi News home page

కేపీసీ@365

Published Sun, Apr 30 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

కేపీసీ@365

కేపీసీ@365

‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత చిరంజీవి నటించబోయే చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకుడనే సంగతి అందరికీ తెలిసిందే. ఆదివారం అతణ్ణి కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ (కేపీసీ) లోకి సాదరంగా ఆహ్వానించారు. ‘ఖైదీ నంబర్‌ 150’ను కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై చిరు తనయుడు, హీరో రామ్‌చరణ్‌ నిర్మించారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తండ్రి 151వ చిత్రాన్ని కూడా ఈ సంస్థపైనే నిర్మించనున్నారు.

ఆదివారంతో కొణిదెల ప్రొడక్షన్స్‌ ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో చిన్న సెలబ్రేషన్స్‌ జరిగాయి. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ – ‘‘కేపీసీ ఫ్యామిలీలోకి సురేందర్‌రెడ్డిగారిని ఆహ్వానిస్తున్నాను. ఆగస్టులో నాన్నగారి కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అలాగే, ఈ సందర్భంగా ‘ఖైదీ నంబర్‌ 150’ వంటి చిత్రాన్ని అందించిన దర్శకులు వీవీ వినాయక్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement