మరో సినిమాను ప్రారంభించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో! | Hero Karthikeya Started New Movie With Arjun Jandhyala | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 17 2019 3:43 PM | Last Updated on Thu, Jan 17 2019 3:43 PM

Hero Karthikeya Started New Movie With Arjun Jandhyala - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌లో రికార్డుల మోత మోగించారు. ఈ సినిమాతో హీరో కార్తీకేయ, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌లకు భారీగా క్రేజ్‌ వచ్చేసింది. పాయల్‌ ఇటీవలె ఎన్టీఆర్‌ కథానాయకుడిలో అతిథి(జయసుధ)పాత్రలో మెరవగా.. హీరో కార్తీకేయ హిప్పీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాయే కాకుండా మరో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ఈ యంగ్‌ హీరో ప్రారంభించాడు.

నూతన దర్శకుడైన అర్జున్‌ జంధ్యాల, కార్తీకేయ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ మూవీ షూటింగ్‌ నేటి(జనవరి 17) నుంచి ఒంగోలులో జరుగుతుందని మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని అనిల్‌ కడియాలా, తిరుమల్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. చైతన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement