ఈ ‘ఆపరేషన్‌’ కూడా సక్సెస్‌ అవ్వాలి – కృష్ణంరాజు | Hero Srikanth initiates Operation 2019 | Sakshi
Sakshi News home page

ఈ ‘ఆపరేషన్‌’ కూడా సక్సెస్‌ అవ్వాలి – కృష్ణంరాజు

Published Sun, Jan 28 2018 12:59 AM | Last Updated on Sun, Jan 28 2018 12:59 AM

Hero Srikanth initiates Operation 2019 - Sakshi

శ్యామల, కృష్ణంరాజు, శ్రీకాంత్, కరణం బాబ్జీ

శ్రీకాంత్, యజ్ఞశెట్టి జంటగా కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ 2019’. ‘బివేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌’ అనేది ఉపశీర్షిక. అలివేలు ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై అలివేలు నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను సీనియర్‌ నటుడు కృష్ణంరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘శ్రీకాంత్‌ ‘సింహ గర్జన’ సినిమాలో నాకు తమ్ముడిగా, ‘మా నాన్నకు పెళ్లి’ సినిమాలో కొడుకుగా యాక్ట్‌ చేశారు. శ్రీకాంత్‌ మంచి నటుడే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా. 

‘ఆపరేషన్‌ దుర్యోధన’లాగా ఈ సినిమా కూడా మంచి హిట్‌ కావాలని ఆశిస్తున్నాను. ‘బివేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌’ అనే క్యాప్షన్‌ చూస్తుంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే వ్యాపారవేత్తలు ఓట్లను కొంటున్నారు. పబ్లిక్‌ కూడా డబ్బుకు ఆశపడుతున్నారు. ఈ సినిమా పబ్లిక్‌ను ఎడ్యుకేట్‌ చేస్తుంది అనుకుంటున్నాను. టీమ్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కృష్ణంరాజుగారు మా సినిమా టీజర్‌ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది.

కరణం బాబ్జీగారితో ఇంతకు ముందు ‘మెంటల్‌ పోలీస్‌’ అనే సినిమా చేశా. అది వివాదాల కారణంగా సరిగ్గా ఆడలేదు. ఈసారి కాంట్రవర్శీ లేకుండా సినిమా చేద్దాం అనుకున్నాం. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు’’ అన్నారు శ్రీకాంత్‌. ‘‘శ్రీకాంత్‌గారు అన్ని విధాలా సహకరించారు. ఆయనతో పాటు ఈ సినిమాలో ఇద్దరు యంగ్‌స్టర్స్‌ నటిస్తున్నారు. వారెవరో త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు దర్శకుడు బాబ్జీ. ‘‘శ్రీకాంత్‌గారి సహకారం మరువలేనిది. కృష్ణంరాజుగారి దంపతులు టీజర్‌ రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత అలివేలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement