నో డూప్‌ | Heroine Nikesha Patel as ROWDY POLICE | Sakshi
Sakshi News home page

నో డూప్‌

Published Sat, Feb 10 2018 1:06 AM | Last Updated on Sat, Feb 10 2018 1:06 AM

Heroine Nikesha Patel as ROWDY POLICE - Sakshi

నికిషా పటేల్‌

‘పులి’ ఫేమ్‌ నికిషా పటేల్‌ గుర్తున్నారా? ఆ తర్వాత ఒకట్రెండు తెలుగు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. తమిళ చిత్రాలు చేయడం మొదలుపెట్టి, అక్కడ బిజీ అయ్యారు నికిషా. చాలా గ్యాప్‌ తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించనున్నారు. నికిషా టైటిల్‌ రోల్‌లో జానీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రౌడీ పోలీస్‌’. ఇందులో నికిషా పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. రిస్కీ ఫైట్స్‌ని ధైర్యంగా చేశారట. దర్శక–నిర్మాతలు డూప్‌తో చేయిద్దామన్నా వినకుండా నికిషా చేయడం చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచింది.

రోప్‌ యాక్షన్‌ సీన్స్‌ని సైతం నికిషా అద్భుతంగా చేశారట. ఇంతకీ ఈ బ్యూటీ అవలీలగా ఫైట్స్‌ చేయడానికి కారణం ఉంది. సినిమాల్లోకి రాక ముందు ఆమె మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అది ఈ సినిమాకి ఉపయోగపడింది. ఆర్‌.ఎ ప్రొడక్షన్స్‌ పతాకంపై వేణు నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుపు కుంటోంది.  ముకుల్‌దేవ్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో భానుచందర్‌ ప్రధాన పాత్రచేస్తున్నా రు. అమిద్, ‘గబ్బర్‌ సింగ్‌’ విలన్‌ బ్యాచ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బాజీ, కెమెరా: ముజీర్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement