విశాఖ కోసం హీరోల క్రికెట్ మ్యాచ్ | heros cricker match in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ కోసం హీరోల క్రికెట్ మ్యాచ్

Nov 4 2014 12:02 AM | Updated on Apr 6 2019 8:52 PM

విశాఖ కోసం హీరోల క్రికెట్ మ్యాచ్ - Sakshi

విశాఖ కోసం హీరోల క్రికెట్ మ్యాచ్

హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా హీరోలు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 7న విజయవాడలో వారు క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు.

హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా హీరోలు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 7న విజయవాడలో వారు క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. శ్రీమిత్రా గ్రూప్, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ వివరాలను సోమవారం సాయంత్రం హైదరబాద్‌లో హీరో శ్రీకాంత్ తెలియజేస్తూ -‘‘షూటింగులు రద్దు చేసుకొని మరీ మన హీరోలు ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు. మా ప్రయత్నానికి అన్ని శాఖల సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో చెక్ అందిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు తరుణ్, అల్లరి నరేశ్, నిఖిల్, రఘు, నవీన్‌చంద్ర, ప్రిన్స్, తనీష్, ఖయ్యూమ్, టీమ్ మేనేజర్ వంకా ప్రతాప్, ‘శ్రీమిత్ర’ చౌదరి, అఖిల్ కార్తీక్, శశాంక్, భూపాల్, సమీర్, అశ్విన్, గిరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement