చరిత్ర చెప్పే చెట్టు
అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్రను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రూపొందుతున్న చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. ఎస్.ఎస్.ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భవ్యశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాలగొండ ఆంజనేయులు దర్శకుడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది.
‘‘600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ నెలాఖరులో పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్యకవి, దర్శకత్వం పర్యవేక్షణ: ఎస్.రామ్‌కుమార్.