రఘువరన్ మళ్లీ వస్తున్నాడు! | Home Entertainment Dhanush (VIP 2) Velai Illa Pattadhaari 2 Movie | Sakshi
Sakshi News home page

రఘువరన్ మళ్లీ వస్తున్నాడు!

Nov 10 2016 10:56 PM | Updated on Sep 4 2017 7:44 PM

రఘువరన్ మళ్లీ వస్తున్నాడు!

రఘువరన్ మళ్లీ వస్తున్నాడు!

మాస్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ హీరో ధనుష్ ‘రఘువరన్ బీటెక్’తో తెలుగువారిని కూడా ఆకట్టుకోగలిగారు.

మాస్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ హీరో ధనుష్ ‘రఘువరన్ బీటెక్’తో తెలుగువారిని కూడా ఆకట్టుకోగలిగారు. ‘వేలై ఇల్లా పట్టదారి’ (వీఐపి)కి అనువాద చిత్రం ఇది. అటు తమిళంలో, ఇటు తెలుగులోనూ ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ మొదలైంది. విశేషం ఏంటంటే... రజనీకాంత్ రెండో కుమార్తె, ధనుష్ మరదలు సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ‘విఐపి 2’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి  ‘రఘువరన్ ఈజ్ బ్యాక్’ అన్నది ట్యాగ్‌లైన్. గురువారం ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి స్టోరీ, డైలాగ్స్ ధనుష్ రాయడం ఓ విశేషం. ‘కబాలి’ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement