చెత్త అవార్డులు సిద్ధం! | 'Humshakals' leads nominations list at Golden Kela Awards | Sakshi
Sakshi News home page

చెత్త అవార్డులు సిద్ధం!

Published Tue, Feb 17 2015 11:36 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

చెత్త అవార్డులు సిద్ధం! - Sakshi

చెత్త అవార్డులు సిద్ధం!

ఎప్పుడూ ‘ఉత్తమ’ అవార్డులేనా? ‘చెత్త’ అవార్డులు కూడా ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన అవార్డ్స్ ‘గోల్డెన్ కేలా’. 2009లో జతిన్ వర్మ ప్రారంభించిన ఈ హిందీ సినీ అవార్డుల ప్రదానోత్సవం ప్రతి ఏటా నిరాటంకంగా జరుగుతూనే వుంది. మామూలుగా ‘బెస్ట్ అవార్డ్ గోస్ టు...’ అంటుంటారు. కానీ, ఈ వేదికపై ‘వరస్ట్ అవార్డ్ గోస్ టు..’ అని విజేతలను ప్రకటిస్తారు. ఈ ఏడాదికి సంబంధించిన అవార్డుల ప్రదానం వచ్చే నెల 14న న్యూఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్స్‌ను విడుదల చేశారు.
 
 చెత్త నటీనటుల విభాగంలో రాణీ ముఖర్జీ (మర్దానీ), కత్రినా కైఫ్ (బ్యాంగ్ బ్యాంగ్), సోనాక్షీ సిన్హా (యాక్షన్ జాక్సన్, లింగ, హాలిడే), సోనమ్ కపూర్ (ఎవ్రీథింగ్ షీ డిడ్), తమన్నా (ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్), జాక్వెలైన్ ఫెర్నాండెజ్ (కిక్), సల్మాన్ ఖాన్ (జయహో, కిక్), సైఫ్ అలీఖాన్ (హమ్ షకల్స్), అజయ్ దేవగన్ (యాక్షన్ జాక్సన్), అర్జున్ కపూర్ (గుండే, ఎవ్రీథింగ్ ఎల్స్) ఎంపికయ్యారు. చెత్త చిత్రం విభాగంలో కిక్, బ్యాంగ్ బ్యాంగ్, యాక్షన్ జాక్సన్, హమ్ షకల్స్, హాపీ న్యూ ఇయర్ నామినేట్ అయ్యాయి.
 
  దర్శకుడి విభాగంలో సాజిద్ ఖాన్ (హమ్ షకల్స్), ప్రభుదేవా (యాక్షన్ జాక్సన్), రోహిత్ శెట్టి (సింగమ్ రిటర్న్స్), సాజిద్ నడియాడ్‌వాలా (కిక్), సొహైల్ ఖాన్ (జయహో), సిద్ధార్ధ్ ఆనంద్ (బ్యాంగ్ బ్యాంగ్) ఎంపికయ్యారు. ఇంకా పలు విభాగాలకు సంబంధించిన నామినేషన్స్ విడుదల చేశారు. ఆరేళ్ల క్రితం ఈ అవార్డులు ప్రారంభించామనీ, రాను రాను క్రేజ్ పెరుగుతోందనీ ఈ అవార్డుల వ్యవస్థాపకుడు జతిన్ వర్మ పేర్కొన్నారు. కాగా, ఉత్తమ అవార్డులు అందుకోవడానికి అలవాటుపడ్డ తారలు, ఈ చెత్త అవార్డులను కూడా అంగీకరిస్తున్నారు. వీటిని సరదాగా తీసుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement