అవసరమైతే ఆపరేషన్ చేయించుకుంటా! | 'I don't want him to grow up': Sofia Vergara playfully breaks down in tears as she gushes about her son Manolo | Sakshi
Sakshi News home page

అవసరమైతే ఆపరేషన్ చేయించుకుంటా!

Published Sun, Aug 17 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

అవసరమైతే ఆపరేషన్ చేయించుకుంటా!

అవసరమైతే ఆపరేషన్ చేయించుకుంటా!

‘‘నా వంటి మీద ముడత పడనివ్వను’’ అని చెబుతున్నారు సోఫియా వెర్గరా. ఈ హాలీవుడ్ హాట్ లేడీ వయసిప్పుడు దాదాపు 40. అందం మీద అతిగా శ్రద్ధపెడతారు సోఫియా. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లాలంటే గంటల తరబడి రెడీ అవుతారట. ఆ సమయంలో ఇంట్లోవాళ్లు తొందరపెట్టినా పట్టించుకోనని, నింపాదిగా తయారవుతానని సోఫియా అంటున్నారు. అందం మీద ఇంతగా శ్రద్ధ పెట్టే మీకు ఇప్పుడు కాకపోయినా... కొన్నేళ్ల తర్వాత అయినా...
 
  ముడతలు పడే వయసొచ్చేస్తుంది కదా? ఏమైనా దిగులుగా ఉందా? అనే ప్రశ్నను సోఫియా ముందుంచితే.. నాకేం దిగులు అంటున్నారు దిలాసాగా! మరింత వివరంగా చెబుతూ - ‘‘వయసు మీద పడితే ముడతలు రావడం సహజమని చాలామంది సరిపెట్టుకుంటారు. కానీ, నావల్ల కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, అందుకే అవసరమైతే ఆపరేషన్ చేయించేసుకుంటా. వీలైనంత యంగ్‌గా కనిపించాలన్నదే నా తాపత్రయం. భవిష్యత్తుల్లో కళ్ల కింద చారలు ఏర్పడతాయి. వాటి ఆనవాళ్లు కూడా కనిపించకుండా చేసేస్తా’’ అన్నారు ఈ కోమలాంగి మరింత కులాసాగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement