
చిరు 151పై ఇంట్రస్టింగ్ న్యూస్
ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, 100 కోట్ల కలెక్షన్లతో సత్తా చాటాడు. ఇప్పటీకీ తనలో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్న మెగాస్టార్ త్వరలో 151 సినిమాను మరింత భారీగా సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చారిత్రక కథాంశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చిరు 151వ సినిమాగా తెరకెక్కించనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.
భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రిటీష్ పాలకులపై ఎదురు తిరిగిన తెలుగు తేజం ఉయ్యాలవాడ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ను నిర్మిస్తున్నారు.
అంతేకాదు చిరు సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటి ఐశ్వర్యరాయ్ను సంప్రదిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ మరోసారి కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడుతూ త్వరలోనే అఫీషియల్ డిటెయిల్స్తో పాటు లాంచింగ్ డేట్ను కూడా ఎనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది మెగా టీం.