ఎవరి టాలెంట్ వారిదే... | It is not fair to compare the people, says Arjun Kapoor | Sakshi
Sakshi News home page

ఎవరి టాలెంట్ వారిదే...

Published Sun, Mar 13 2016 6:58 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఎవరి టాలెంట్ వారిదే... - Sakshi

ఎవరి టాలెంట్ వారిదే...

ముంబై: ఇండస్ట్రీలో ఒకరిని మరొకరితో పోల్చడం మంచిది కాదని బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అభిప్రాయపడ్డాడు. ఎవరి టాలెంట్ వారిదేనని.. అందరూ ఎవరికి వారు చాలా భిన్నమని చెప్పాడు. ఒకరి నైపుణ్యాన్ని మరొకరితో పోల్చి చూడటం పై తనకు అంతగా నమ్మకం లేదన్నాడు. ప్రస్తుతం తాను చేస్తున్న పనిపై ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానంటున్నాడు ఈ యంగ్ హీరో.

'సినిమాలలో భిన్నమైన పాత్రలు చేశాను. ఇప్పుడు బుల్లితెరపై ప్రయోగాలకు సిద్ధం అవుతున్నాను. దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అని అర్జున్ చెప్పుకొచ్చాడు. బాల్కీ దర్శకత్వం వహించిన తన లేటెస్ట్ 'కీ అండ్ కా' మూవీ ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నాడు. టీవీ, సినిమా లలో రెండు భిన్నమైనవే.. సినిమాలతో పోల్చితే టీవీ షో చేయడం కాస్త కష్టమని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement