హౌస్ హస్బెండ్గా ఉంటే తప్పేంటి?
న్యూఢిల్లీ : మనం ఎక్కువగా హౌస్ వైఫ్ అనే పదాన్ని వింటుంటం కదా. మీ భార్య ఏం చేస్తుందంటే.. భర్తల నుంచి వచ్చే సమాధానం హౌస్ వైఫ్(గృహిణి). అయితే, ఇవేం పట్టించుకోకుండా హౌస్ హస్బెండ్గా ఉంటే తప్పేంటని బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ అంటున్నాడు. అర్జున్ ఇలా మాట్లాడుతున్నాడేంటి.. అసలు ఈ హీరోకి ఏమైంది.. ఎవరికీ తెలియకుండా అతడు పెళ్లి చేసుకున్నాడా ఏంటి.. అనే అనుమానాలు అభిమానుల్లో తలెత్తుతాయి.
'చీనికమ్' దర్శకుడు ఆర్ బాల్కీ తీస్తున్న తాజా చిత్రం 'కీ అండ్ కా'లో అర్జున్కపూర్ హౌస్ హస్బెండ్ పాత్రలో కనిపించనున్నాడు. అతడికి జోడీగా బాలీవుడ్ 'బెబో' కరీనాకపూర్ నటిస్తున్న విషయం విదితమే. భార్య విజయానికి కృషి చేసేందుకు పూనుకున్న భర్తగా ఈ మూవీలో నటిస్తున్నాడు. బిగ్ బీ అమితాబ్ దంపతులు ఈ మూవీలో కనిపించనున్నారు. వారి కళ్లముందే పెరిగాను.. ఇప్పుడు వారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు నేను చాలా అదృష్టవంతుడినని చెప్పుకొచ్చాడు. ఢిల్లీకి చెందిన దంపతుల చుట్టూ ఈ కథ అల్లుకుని ఉంటుంది. తర్వాతి తరం ఇలా ఆలోచించే అవకాశాలు ఉన్నాయంటూ అర్జున్ చమత్కరించాడు.