మెటర్నిటీ లీవ్ తీసుకోనున్న స్టార్ హీరోయిన్ | It's official: Kareena Kapoor is pregnant, to be on a maternity leave post September! | Sakshi
Sakshi News home page

మెటర్నిటీ లీవ్ తీసుకోనున్న స్టార్ హీరోయిన్

Published Sat, Jul 2 2016 3:33 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

మెటర్నిటీ లీవ్ తీసుకోనున్న స్టార్ హీరోయిన్

మెటర్నిటీ లీవ్ తీసుకోనున్న స్టార్ హీరోయిన్

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ త్వరలో మెటర్నిటీ లీవ్ తీసుకోనున్నారు. ఆ శుభవార్తను స్వయంగా ఆమె భర్త, బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ స్పష్టం చేశారు. ఇంతకు ముందే కరీనా గర్భవతి అంటూ మీడియాలో పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై సైఫ్ అప్పుడు నోరు మెదపలేదు. డిసెంబర్ నెలలో తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నామంటూ సైఫ్ ప్రస్తుతం సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

కాగా సెప్టెంబరు నెల వరకు షూటింగులన్నీ పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు కరీనా. సోనమ్ కపూర్తో కలిసి నటిస్తున్న తన తదుపరి చిత్రం షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు నెలలో మొదలు కావల్సి ఉండగా..  ఆమె ఆరోగ్య రీత్యా షూటింగ్ జూలై నెలలోనే మొదలుపెట్టే అవకాశాలున్నాయి. మొత్తానికి కరీనా సెప్టెంబరు నెల నుంచి సినిమాల నుంచి విరామం తీసుకోనున్నారు.  

సైఫ్, కరీనాలు 2012లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి విదితమే. తన భార్య గర్భవతి అని, డిసెంబరులో తొలి సంతానాన్ని పొందుతామంటూ శనివారం ప్రకటించిన సైఫ్.. తమ దంపతులకు ఆశీస్సులందించిన  శ్రేయోభిలాషులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement