
ఇది యూత్‌ఫుల్ టైటిల్ : పూరి జగన్నాథ్
‘‘యువత మెచ్చే స్థాయిలో ఈ చిత్రం ఉంటుందనుకుంటున్నాను. కచ్చితంగా ఇది మంచి విజయం సాధిస్తుంది. పేరు యూత్‌ఫుల్‌గా ఉంది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. వరుణ్‌సందేశ్, వితికా శేరు జంటగా పాంచజన్య మీడియా పతాకంపై నల్లమటి రామచంద్రారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. మహేశ్ ఉప్పుటూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని పూరి జగన్నాధ్ ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. ఈ నెల 22న పాటలు విడుదల చేస్తాం’’ అని చెప్పారు.