
తొలిరోజు రూ. 5.5 కోట్ల వసూళ్లు
ముంబై: అమెరికా టెలివిజన్ షో 'క్వాంటికో'లో నటించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజా చిత్రం 'జై గంగాజల్' తొలిరోజు 5.5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. తొలిరోజు కలెక్షన్లలో మరో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ నటించిన 'నీర్జా'ను బ్రేక్ చేసింది. నీర్జా సినిమా తొలిరోజు 4.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే.
శుక్రవారం విడుదలైన జై గంగాజల్ చిత్రానికి విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. క్రమేణా వసూళ్లు పుంజుకుంటాయని భావిస్తున్నారు. 2003లో విడుదలైన గంగాజల్ సినిమాకు సీక్వెల్గా తీసిన ఈ చిత్రంలో ప్రియాంక పోలీస్ అధికారిణి పాత్రలో నటించింది. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో ఈ సినిమాను 18 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు.