కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక | When Priyanka Chopra broke down on the sets of 'Jai GangaaJal' | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక

Published Mon, Feb 15 2016 9:41 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక

కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కన్నీళ్లు పెట్టుకుంది. చిన్నపిల్లలా ఏడ్చింది. ఆమెను దర్శకుడు ప్రకాశ్ ఝా ఓదార్చారు. 'జై గంగాజల్' సినిమా షూటింగ్ సెట్ లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. యాక్షన్ సీన్ తీస్తుండగా సహనటుడు మానవ్ కాల్ మెడపై ప్రియాంక పొరపాటున తన్నింది. అతడు ఛాతిపై తన్నాలని ఫైట్ మాస్టర్ చెప్పగా, ప్రియాంక పొరపాటున అతడి మెడపై తన్నేసింది. దీంతో ఒక్కసారిగా అతడు కుప్పకూలాడు. యూనిట్ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మానవ్ దెబ్బలేవీ తగలనప్పటికీ అతడు షాక్ తిన్నాడు.

అయితే తాను చేసిన పొరపాటుతో ప్రియాంక వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది. షూటింగ్ లో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయని దర్శకుడు ప్రకాశ్ ఝా సర్దిచెప్పినా ఆమె ఏడుపు ఆపలేదు. తాను కావాలని తన్నలేదని, పొరపాటుగా అలా జరిగిందని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మానవ్ వెంటనే తేరుకున్నా ప్రియాంక మాత్రం తప్పు చేసిన భావనతో చాలా బాధ పడిందని ప్రకాశ్ ఝా తెలిపారు. షూటింగ్ లో సహనటులకు ఆమె ఎంతో సహకరిస్తుందని కొనియాడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement