
అలనాటి అందాల తార శ్రీదేవి నటన, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో ఇండియన్ సూపర్ స్టార్‌గా నిలిచారు శ్రీదేవి. ఆమె వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. తొలి చిత్రం ‘ధడక్’తో విజయంతో పాటు నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్. అందం, అభినయంతో తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటున్నారు జాన్వీ. ప్రస్తుతం జాన్వీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
శ్రీదేవిలానే జాన్వీ కూడా మంచి డ్యాన్సర్ అనే సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. త్వరలో పాల్గొనబోయే ఓ కార్యక్రమం కోసం కొరియోగ్రాఫర్‌తో కలిసి జాన్వీ క్లాసికల్ డ్యాన్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొరియోగ్రాఫర్ సంజయ్ శెట్టి. ఈ వీడియో చూసిన అభిమానులు ‘మరోసారి శ్రీదేవిని గుర్తు చేశారం’టూ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment