శ్రీదేవి కూతురి సిక్స్‌ ప్యాక్‌ చిట్కాలు.! | Janhvi Kapoor's viral gym video tells you how to get six-pack abs in 5 mins | Sakshi
Sakshi News home page

శ్రీదేవి కూతురి సిక్స్‌ ప్యాక్‌ చిట్కాలు.!

Published Tue, Dec 19 2017 3:28 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

Janhvi Kapoor's viral gym video tells you how to get six-pack abs in 5 mins - Sakshi

ముంబై: దడక్‌ చిత్రంతో సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ జిమ్‌లో తెగవర్క్‌ అవుట్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో అభిమానులను అలరించిన జాన్వీ.. ఈ  మూవీ కోసం తెగ కష్టపడుతోంది. హీరోయిన్‌ కాకముందే సోషల్‌ మీడియా వేదికగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా ఫిట్‌నెస్‌ పాఠాలు చెబుతోంది.

తన పర్సనల్‌ ట్రైనర్‌తో జిమ్‌లో సిక్స్‌ప్యాక్‌ ఎలా సాధించాలనే చిట్కాలు చెబుతూ.. వర్కఅవుట్‌లకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక మరాఠీ సూపర్‌ హిట్‌ మూవీ ‘సైరాత్‌’కు హిందీ రిమేక్‌ చిత్రమే దడక్‌. ఈ మూవీని కరణ్‌ జోహర్‌ నిర్మిస్తుండగా.. శశాంక్‌ కైతాన్‌ హీరోగా నటిస్తున్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement