హాలీవుడ్ హీరోలా ఎన్టీఆర్! | Jr NTR's New Look for Sukumar's Movie | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ హీరోలా ఎన్టీఆర్!

Published Mon, Jul 6 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

హాలీవుడ్ హీరోలా ఎన్టీఆర్!

హాలీవుడ్ హీరోలా ఎన్టీఆర్!

ఈ ఫొటోలో దర్శకుడు సుకుమార్‌తో ఉన్న వ్యక్తిని చూశారా? హాలీవుడ్ హీరోలా స్టయిలిష్‌గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో కాదు... ఎన్టీఆర్. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ (‘నాన్నకు ప్రేమతో...’ అనేది వర్కింగ్ టైటిల్) లండన్‌లో మొదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గెటప్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరోలను స్టయిలిష్‌గా చూపించ డంలో సుకుమార్ దిట్ట. ‘1 - నేనొక్కడినే’ సినిమాలో మహేశ్‌ను ఒక రేంజ్‌లో చూపించిన సుకుమార్ ఇప్పుడు ఎన్టీఆర్‌ను తనదైనశె లిలో ఆవిష్కరించారు.

ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. ‘‘సెప్టెంబర్ 20 వరకు లండన్‌లోనే తొలి షెడ్యూల్ జరుగుతుంది. తర్వాత రెండు షెడ్యూల్స్‌తో చిత్రం పూర్తవుతుంది’’ అని సుకుమార్ తెలిపారు. ఎన్టీఆర్‌కిది 25వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement