మరికొద్దిరోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమోషన్ | junior ntr to become father soon | Sakshi
Sakshi News home page

మరికొద్దిరోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమోషన్

Published Wed, Apr 30 2014 2:17 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

మరికొద్దిరోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమోషన్ - Sakshi

మరికొద్దిరోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమోషన్

హీరో జూనియర్ ఎన్టీఆర్ మరి కొద్దిరోజుల్లో తండ్రి కాబోతున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ వార్త ఫిల్మ్నగర్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఇంతవరకూ జూనియర్ ఎన్టీఆర్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఎన్టీఆర్ తండ్రి కాబోతున్న విషయం మాత్రం ఎన్నికల సందర్భంగా బుధవారం నాడు స్పష్టమైంది. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు బుధవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వచ్చారు.

చాలాకాలంగా మీడియాకు కనిపించకుండా దూరంగా ఉన్న లక్ష్మీ ప్రణతి.. ఎన్నికల పేరుతోనే సుదీర్ఘ కాలం తర్వాత బయట  కనిపించింది. ఇటీవల బీవీయస్‌యన్ ప్రసాద్ కుమార్తె వివాహానికి ఎన్టీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. ఆ వేడుకలో లక్ష్మీప్రణతిని చూసినవారు ఆమె గర్భవతేమో అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె ఏడు నెలల గర్భవతి అని సమాచారం. 2011లో ఎన్టీఆర్‌-లక్ష్మీప్రణతిల వివాహం జరిగింది. ఇటీవలే మరో హీరో అల్లు అర్జున్ కూడా తండ్రి అయిన విషయం తెలిసిందే. బన్నీ సతీమణి స్నేహ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకి అయాన్ అనే పేరు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement