అక్క తరఫున ప్రచారం చేయట్లేదు: బాలకృష్ణ
తన సోదరి, రాజంపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని పురందేశ్వరి తరఫున తాను ప్రచారం చేయట్లేదని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. తన రూట్మ్యాప్లో అసలు రాజంపేట లేనే లేదని ఆయన తెలిపారు. అలాగే, తన తరఫున ప్రచారం చేయడానికి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలను కూడా ఆహ్వానించలేదని ఆయన చెప్పారు.
సినిమా పరిశ్రమ నుంచి కూడా ఎవ్వరినీ ప్రచారానికి ఆహ్వానించట్లేదని అన్నారు. దేశ అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నామని బాలకృష్ణ చెప్పారు. పార్టీని నమ్ముకున్న వారిలో చాలామందికి టికెట్లు ఇవ్వలేదన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. పార్టీ కోసమే అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చారు.