అక్కడ పుట్టడమే నా తప్పు!
‘‘నా చేతుల్లో లేని తప్పు ఒకటి నా జీవితంలో జరిగిపోయింది’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ఇంతకీ ఏంటా తప్పు? అనడిగితే... ‘‘ఉత్తరాది కుటుంబంలో పుట్టడమే నేను చేసిన తప్పు. నా స్నేహితులు, ఫ్యామిలీతో నేనెప్పుడూ ‘బై మిస్టేక్ నేను రాంగ్ ఫ్యామిలీలో పుట్టా’ అని చెబుతుంటా! (నవ్వుతూ) ఐయామ్ పక్కా సౌతిండియన్ ఎట్ హార్ట్. ఇక్కడి వంటకాలనే ఇష్టపడతా. నేను దక్షిణాదికి చెందిన అమ్మాయినని నా ఫీలింగ్’’ అని నవ్వేశారు.
అసలు మేటర్ ఏంటంటే... ‘ఏంటి! ఈ మధ్య హిందీ సినిమాల్లో నటించడం లేదు. హిందీపై ఫోకస్ తగ్గించారా?’ అని కాజల్‌ను ప్రశ్నిస్తే ఇదంతా చెప్పుకొచ్చారు. ‘‘హిందీ నుంచి ఛాన్సులొస్తున్నాయి. కానీ, నాకు తెలుగు, తమిళ సినిమాలు చేయడమే ఇష్టం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు హ్యాపీగా ఉంది. సౌత్‌లోనే నా కెరీర్ మొదలైంది. ఇక్కడ మంచి మంచి ఛాన్సులు వస్తున్నప్పుడు హిందీకి ఎందుకు వెళ్లాలి? అక్కడికి వెళ్లడానికి నాకు కారణాలు ఏవీ కనిపించడం లేదు. హిందీలో నటించడం కోసం రాజీపడి మంచి ఛాన్సులు వదులుకోలేను’’ అన్నారు కాజల్. సో, ఈ చందమామ సౌత్ సినిమాలను వదలి ఎక్కడికీ వెళ్లాలనుకోవడం లేదన్నమాట!!