కమల్ పూర్తిగా కోలుకున్నాడు | Kamal Haasan finally back from injury | Sakshi
Sakshi News home page

కమల్ పూర్తిగా కోలుకున్నాడు

Dec 22 2016 10:35 AM | Updated on Sep 4 2017 11:22 PM

కమల్ పూర్తిగా కోలుకున్నాడు

కమల్ పూర్తిగా కోలుకున్నాడు

లోకనాయకుడు కమల్ హాసన్ కొంత కాలంగా ఇంటికే పరిమితమయ్యాడు. తన ఇంట్లో జరిగిన ప్రమాదంలో గాయపడిన కమల్ సెట్స్ మీద ఉన్న శభాష్ నాయుడు సినిమా షూటింగ్ను

లోకనాయకుడు కమల్ హాసన్ కొంత కాలంగా ఇంటికే పరిమితమయ్యాడు. తన ఇంట్లో జరిగిన ప్రమాదంలో గాయపడిన కమల్ సెట్స్ మీద ఉన్న శభాష్ నాయుడు సినిమా షూటింగ్ను కూడా ఆపేయాల్సి వచ్చింది. దాదాపు ఐదు నెలలకు పైగా షూటింగ్ వాయిదా వేసిన కమల్, ఇప్పుడు పూర్తి ఫిట్గా కనిపిస్తున్నాడు. కొద్ది రోజులుగా బయట ఎక్కడా కనిపించిన లోకనాయకుడు తాజాగా చెన్నై ఎయిర్ పోర్ట్లో కనిపించాడు.

ప్రస్తుతం ఫిట్గా ఉండటంతో జనవరి మొదటి వారంలోనే శభాష్ నాయుడు షూటింగ్ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ మురుదనాయగం సినిమాను కూడా తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు కమల్. శభాష్ నాయుడు సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ మురుదనాయగం ను తిరిగి ప్రారంభించేందుంకు ప్లాన్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement