ముంబై: పరిశ్రమలో తనని ‘గోల్డ్ డిగ్గర్’ (డబ్బులు కోసం పురుషులతో సన్నిహితంగా ఉండటం)అని అనేవాళ్లని బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ అన్నారు. అందుకని 50 ఏళ్ళలోనే ధనవంతుల జాబితాలో చేరి అది తప్పని నిరూపించాలనుకున్నానని కూడా చెప్పారు. కంగన ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ... ‘అప్పుడు నాపై చేస్తున్న వ్యాఖ్యలను ఎలా తిరస్కరించాలో అర్థమయ్యేది కాదు. అది నిజం కాదని ఎలా నిరూపించుకోవాలో కూడా నాకు తెలియదు. గౌరవమైన, సాంప్రదాయ నేపథ్యం ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబ నుంచి వచ్చిన అమ్మాయికి ఇక్కడ అందరిలాగే గౌరవం, ప్రేమ ఎందుకు దొరకదు. ఎందుకంటే ఇది స్వపక్షపాత భౌతికవాద(బంధుప్రీతి) ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎలాంటి బ్యాగ్‌గ్రౌండ్ లేని వారికి గౌరవం ఉండదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 50 ఏళ్ల వయసులోనే డబ్బు, భవనాలు సంపాదించుకుని భారతదేశ ధనవంతుల జాబితాలో చేరాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. (ఎంతగా ప్రాధేయపడ్డాడో పాపం సుశాంత్..)
అంతేగాక ‘‘సినిమాలోకి వచ్చిన కొత్తలో ఆవార్డు ఫంక్షన్స్‌కు వెళ్లేందుకు అప్పుడు నా దగ్గర ఖరీదైన దుస్తులు కూడా లేవు. అలాంటి ఫంక్షన్స్‌కైతే స్టార్ కిడ్స్‌కు డిజైనర్స్ ఫ్రాక్స్‌ను స్పాన్సర్ చేస్తారు. కానీ నేను స్టార్‌కిడ్‌ను కాదు కదా. అప్పుడు గ్యాంగ్‌స్టర్ సినిమాకు నాకు అవార్డు వచ్చింది. ఆ సమయంలో ఆ అవార్డు కార్యక్రమానికి వెళ్లేందుకు మంచి డ్రెస్ కొనక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నా ఫ్రెండ్ డిజైనర్ రిక్కిరాయ్ నాకు డ్రెస్ స్పాన్సర్ చేశాడు. దాని కోసం అతడు చాలా కష్టపడ్డాడు. కానీ అతని తల్లిదండ్రులు అతడికి సాయం చేశారు’’ అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment