పైలైట్‌.. హైలైట్‌ | Kangana Taking Training As Pilot For Her New Movie | Sakshi
Sakshi News home page

పైలైట్‌.. హైలైట్‌

Published Tue, Feb 18 2020 4:33 AM | Last Updated on Tue, Feb 18 2020 4:51 AM

Kangana Taking Training As Pilot For Her New Movie - Sakshi

కంగనా రనౌత్‌ ఎలాంటి అమ్మాయి? అంటే డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌. అలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి కాబట్టే నటిగా కూడా ధైర్యంగా రిస్కులు తీసుకుంటుంది. ‘మణికర్ణిక’ సినిమాలో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్‌ పాత్ర చేసింది. ఆ సినిమాలో అలవోకగా కత్తి తిప్పుతూ యుద్ధం చేసింది. ఇప్పుడు ‘తేజస్‌’ సినిమాలో మరో డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ క్యారెక్టర్‌ చేస్తోంది. ఇందులో యుద్ధ విమానం నడిపే పైలెట్‌ పాత్రలో కనిపించనుంది కంగనా. సోమవారం ఆమె పాత్ర లుక్‌ని విడుదల చేశారు. యుద్ధ విమానం ముందు పైలెట్‌ యూనిఫామ్‌లో, చేత్తో హెల్మెట్‌ పట్టుకుని ఉన్న కంగనా లుక్‌ హైలైట్‌. ‘‘మన జాతి కోసం యూనిఫామ్‌ వేసుకుని, త్యాగాలు చేస్తున్న గుండె ధైర్యం ఉన్న స్త్రీల్లారా.. ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌గా కంగనా లుక్‌ ఇదిగో’’ అంటూ చిత్రబృందం ఆమె లుక్‌ని విడుదల చేసింది. సర్వేష్‌ మేవారా దర్శకత్వంలో రోనీ స్క్ర్యూవాలా సంస్థ ఈ చిత్రం నిర్మించనుంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కానుంది. ఈలోపు పైలైట్‌ పాత్ర కోసం కంగనా శిక్షణ తీసుకోబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement