కార్తీ కసరత్తు | Karthi goes gymming for his next film with Mani Ratnam | Sakshi
Sakshi News home page

కార్తీ కసరత్తు

Published Tue, Jun 21 2016 1:57 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

కార్తీ కసరత్తు - Sakshi

కార్తీ కసరత్తు

ఈ హైటెక్ రోజుల్లో సినీ ప్రేక్షకుల్ని మెప్పించడం సులభతరం కాదు. కొత్తదనం కోసం చాలా కథల విషయంలో దర్శక నిర్మాతలు చాలా కుస్తీ పట్టాల్సి ఉంటుంది. ఇక పాత్రల పోషణలో వైవిధ్యం కోసం నటీనటులు బాగానే కసరత్తులు చేయాల్సి ఉంది. ఇప్పుడు చాలా మంది హీరోలు ఇందు కోసం శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. ఐ చిత్రం కోసం విక్రమ్ పడ్డ కష్టం ఇంతా అంతా కాదు. నటుడు సూర్య 24 చిత్రంలో త్రిపాత్రాభినయం కోసం చాలా కృషి చేశారు. మరి కొందరు సిక్స్‌ప్యాక్ అంటూ కండలు పెంచడం వంటి సంఘటనలు చాలానే చూశాం.
 
 తాజాగా యువ నటుడు కార్తీ అలాంటి శ్రమతో తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కాష్మోరా చిత్రం కోసం తన జుత్తును త్యాగం చేసి గుండు కొట్టించుకుని నటించిన కార్తీ, ఆ చిత్రాన్ని పూర్తి చేసి దర్శకుడు మణిరత్నం చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ అదితిరావు నటించనున్నారు. ఇంకా పేరు నిర్ణయించిని ఈ చిత్రం వచ్చే నెల సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
 
 ఈ చిత్రంలో కార్తీ పెలైట్‌గా నటించనున్నారు. ఈ పాత్ర కోసం తను బరువు తగ్గి స్లిమ్‌గా తయారవుతున్నారు. ఇందుకోసం నిత్యం జిమ్ బాట పట్టి కసరత్తులు చేస్తున్నారట. కాగా మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ బాణీలు కట్టడం ప్రారంభించారు. చిత్రంలోని పాటల్ని వైరముత్తు రాస్తున్నారు. రవివర్మ ఛాయాగ్రహణం అందించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement