ఆయనకు విలన్‌గా అయితే ఓకే! | Karthi's Kaashmora movie success meet was held in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆయనకు విలన్‌గా అయితే ఓకే!

Published Thu, Nov 3 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

ఆయనకు విలన్‌గా అయితే ఓకే!

ఆయనకు విలన్‌గా అయితే ఓకే!

‘‘కాష్మోరా పాత్రను చాలా వైవిధ్యంగా చూపించాం. రాజ్ నాయక్ పాత్ర కోసం నలభై కిలోలుండే కాస్ట్యూమ్‌తో విలనిజం చూపుతూనే, తనేంటో హావభావాలతో బయటపెట్టాలి. దర్శకుడు ఈ పాత్రలను తెరపై చూపించిన విధానం సూపర్’’ అన్నారు హీరో కార్తీ. ఆయన హీరోగా నయనతార, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే, ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన ‘కాష్మోరా’ ఇటీవల విడుద లైంది. కార్తీ మాట్లాడుతూ -‘‘కాష్మోరా’ రెగ్యులర్ కాన్సెప్ట్ చిత్రం కాదు. హారర్‌కు వినోదం జోడించడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

సినిమా ఫస్టాఫ్ ఇరవై రోజుల్లో షూట్ చేశాం. సెకండాఫ్‌కు ఏడాదిన్నర పట్టింది. అన్నయ్య (హీరో సూర్య) ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశారు. ఆయనకు నచ్చడంతో యూనిట్‌ను అభినందించారు. ‘కాష్మోరా’కు ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదు. హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. పూర్తి స్థాయి విలన్‌గా చేసే ఉద్దేశం లేదు. అన్నయ్య హీరో అయితే విలన్‌గా చేయడానికి ఓకే. ప్రస్తుతం మణిరత్నంగారి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఎనిమిది రోజుల షూటింగ్ మినహా పూర్తయింది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement