మేం అన్నివేళలా అందంగా ఉండం | Kate Winslet gives inspiring body image message to girls | Sakshi
Sakshi News home page

మేం అన్నివేళలా అందంగా ఉండం

Published Fri, Jan 1 2016 11:23 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

మేం అన్నివేళలా అందంగా ఉండం - Sakshi

మేం అన్నివేళలా అందంగా ఉండం

లాస్ ఏంజెల్స్: టైటానిక్ భామ కేట్ విన్‌స్లెట్ (40) అమ్మాయిలకు ఓ బ్రహ్మాండమైన సత్యం చెప్పింది. మెరిసే కళ్లతో,  అద్భుతమైన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ యువతులకు ఆసక్తికరమైన సందేశాన్నిస్తోంది. వెండితెర మీద, అవార్డు ఫంక్షన్లలోను కళ్లు చెదిరే అందంతో అందరినీ ఆకట్టుకునే తమలాంటి సెలబ్రిటీలు.. ఎప్పుడూ అంత అందంగా ఉంటారన్న భ్రమలు పెట్టుకోవద్దని తెలిపింది. అవార్డు ఫంక్షన్లలోనూ, రెడ్ కార్పెట్ మీద అడుగులు వేసేటపుడు ఉన్న అందం.. అన్నివేళలా ఉండదని పేర్కొంది. వృత్తి నిర్వహణలో భాగంగా తాము అలా మెరవక తప్పదని,  మిగతా సమయంలో అందరిలాగే సాధారణంగానే ఉంటామని, ఈ విషయాన్ని యువతులు గ్రహించాలని సూచించింది. ఈ విషయాన్ని ఈ తరం యువతులకు చెప్పడం చాలా ముఖ్యమైందిగా తాను భావిస్తున్నానంది.
 
టైటానిక్  మూవీలో రోజ్‌గా అందరి మదిలో నిలిచిపోయిన ఈ భామ  మరో విషయాన్నికూడా తన అభిమానులతో పంచుకుంది. తాను చిన్నపుడు  చాలా బొద్దుగా ఉండేదాన్నిని, అందరూ తనను చూసి ఆట పట్టించేవారని తెలిపింది. హీరోయిన్ అయ్యే సమయానికి బరువు తగ్గించుకుని నాజూగ్గా తయారైనట్లు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement