ప్రేక్షకులు ఓటేశారు! మరి... సాహో టీమ్‌? | Katrina Kaif to join Baahubali's Prabhas in sci-fi action thriller Saaho? | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు ఓటేశారు! మరి... సాహో టీమ్‌?

Published Sun, May 14 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

ప్రేక్షకులు ఓటేశారు! మరి... సాహో టీమ్‌?

ప్రేక్షకులు ఓటేశారు! మరి... సాహో టీమ్‌?

‘ప్రభాస్‌ పక్కన ఏ పోరి నటిస్తే బాగుంటుంది?’ – హైదరాబాద్‌ గల్లీలో పోరగాళ్ల దగ్గర్నుంచి ముంబయ్‌ మీడియా వరకు ఇప్పుడిదే డిస్కషన్‌! ‘బాహుబలి’తో హీరోగారి ఇమేజ్‌ పెరిగింది. అందువల్ల, సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించనున్న ‘సాహో’ను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తీయాలని ప్లాన్‌ చేశారు. మన ప్రభాస్‌ ఇప్పుడందరికీ తెలుసు. సో, హీరోయిన్‌గా నలుగురికీ తెలిసిన ఫేస్‌ అయితే బెటర్‌... హిందీ హీరోయిన్‌ అయితే ఇంకా బెటరని ‘సాహో’ టీమ్‌ ఆలోచిస్తోందట! ఇది తెలిసిన ఓ ముంబయ్‌ మీడియా హౌస్‌ ‘ప్రభాస్‌ పక్కన ఏ పోరి నటిస్తే బాగుంటుంది?’ అని ఓ సర్వే నిర్వహించింది.

కత్రినా కైఫ్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, కంగనా రనౌత్‌ పేర్లు ఆప్షన్స్‌లో ఇచ్చారు. ప్రభాస్‌కు జోడీగా కత్రినా బాగుంటుందని 49 శాతం, దీపిక బాగుంటుందని 36 శాతం మంది ఓటేశారు. ‘సాహో’ టీమ్‌ మైండ్‌లోనూ వీళ్లిద్దరే ఉన్నారట. ఆల్రెడీ కత్రినాను సంప్రదించారని గాసిప్‌రాయుళ్లు కథ అల్లేశారు. నిజంగా ‘సాహో’ టీమ్‌ మైండ్‌లో ఎవరున్నారో! ప్రస్తుతం ప్రభాస్‌ లండన్‌ టూర్‌లో ఉన్నారు. అతను తిరిగొచ్చిన తర్వాత చిత్రనిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ హీరోయిన్‌ ఎంపికలో ఓ నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement