సాహోలో నాయకి ఎవరు? | Who is the hero in Saho | Sakshi
Sakshi News home page

సాహోలో నాయకి ఎవరు?

Published Tue, Aug 8 2017 2:23 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

సాహోలో నాయకి ఎవరు? - Sakshi

సాహోలో నాయకి ఎవరు?

తమిళసినిమా: సాహో చిత్ర నాయకి ఎవరు? ప్రస్తుతం అందరిలో కుతూహలాన్ని రేకెత్తిస్తున్న అంశం ఇది. కారణం బాహుబలి–2 వంటి వంద సంవత్సరాల భారతీయ సినీ రికార్డులను తిరగరాసిన చిత్రం తరువాత ఆ చిత్ర కథానాయకుడు ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం సాహో. బాహుబలి సిరీస్‌ల వరుసలోనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సాహో చిత్రాన్ని టాలీవుడ్‌ యువ దర్శకుడు సుజిత్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

ఇక్కడి వరకూ ఒకే. ఈ క్రేజీ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటించే ఆ లక్కీ నాయకి ఎవరన్నది వెల్లడి కాలేదు. అసలు కథానాయికి ఎంపిక జరిగిందా? లేదా? అన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. అయితే సాహో చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్న విషయంలో ఇప్పటికే రకరకాల ప్రచారాలు హల్‌చల్‌ చేశాయి. అందులో ప్రధానంగా ప్రభాస్‌తో అధిక చిత్రాల్లో నటించిన అందాల భామ అనుష్క పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తరువాత సాహో చిత్రం తమిళం, తెలుగుతో సహా హిందీలోనూ రూపొందడంతో చిత్ర యూనిట్‌ కన్ను బాలీవుడ్‌ బ్యూటీలపై పడింìదనే ప్రచారం జోరుగా సాగింది.

కత్రినాకైఫ్, దిశాపఠాని, పూజాహెగ్డేలతో చర్చలు జరిపినట్లు వైరల్‌ అయ్యింది. తాజాగా సాహో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్‌ పేరు వినిపిస్తోంది. అయితే ఈ అమ్మడైనా కన్ఫామా? అన్నది చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించే వరకూ వేచి ఉండాల్సిందే. కాగా ఇందులో విలన్‌గా హిందీ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రం ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణను పూర్తి చేసుకుందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement