కెమేరా వెనక్కి అప్పటి అమృత | Keerthana Parthiban film Entry | Sakshi
Sakshi News home page

కెమేరా వెనక్కి అప్పటి అమృత

Published Sat, Dec 27 2014 10:48 PM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

కెమేరా వెనక్కి అప్పటి అమృత - Sakshi

కెమేరా వెనక్కి అప్పటి అమృత

 సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలైన మణిరత్నం ‘అమృత’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటే, అందులో బాలనటిగా చేసిన కీర్తన గుర్తురాక మానదు. చిన్న వయసులోనే తన అభినయంతో ఆకట్టుకుంది కీర్తన. ఆ చిత్రానికి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇంతకీ ఈ కీర్తన ఎవరో కాదు.. తమిళ నటుడు పార్తీబన్, నటి సీత దంపతుల కుమార్తె. ఒకే ఒక్క చిత్రంలో మెరిసిన కీర్తన ఆ తర్వాత చదువుకు అంకితమైంది. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. ఎలాగూ చిన్నప్పుడు నటించింది కదా..
 
  ఇక కథానాయికగా రంగప్రవేశం చేస్తుందని చాలామంది ఊహించారు. కానీ, కీర్తన కలలు వేరేలా ఉన్నాయి. దర్శకురాలు కావాలన్నది ఆమె ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చుకునే దిశలో తొలి అడుగు వేసేసింది. తమిళ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా త్వరలో దర్శకత్వం వహించనున్న ఓ చిత్రానికి ఆమె సహాయ దర్శకురాలిగా చేరింది. కొంత అనుభవం సాధించాక దర్శకురాలిగా రంగప్రవేశం చేయాలనుకుంటోంది. కీర్తన తండ్రి పార్తీబన్ మంచి నటుడే కాదు, దర్శకునిగా కూడా నిరూపించుకున్నారు. ఇప్పుడు కీర్తన కూడా తండ్రిలానే మంచి డెరైక్టర్ అనిపించుకోవాలనుకుంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement