కృష్ణుడూ అర్జునుడూ నేనే!
.‘ఓయ్ కృష్ణా అంటే చాలు. వెంటనే వాళ్ల కళ్ల ముందు ప్రత్యక్షమవుతా! హే అర్జునా.. అని పిలిచినా పలుకుతా! ఎందుకంటే... కృష్ణుడూ నేనే, అర్జునుడూ నేనే’ అంటున్నారు హీరో నాని. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమాకు ‘కృష్ణార్జున యుద్ధం’ టైటిల్ ఖరారు చేశారు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేయనున్నారు. వెంకట్ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించనున్న ఈ సినిమాకు ‘హిప్ హాప్’ తమిళ స్వరకర్త. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.