గాళ్ ఫ్రెండ్ తో కెమెరాకు చిక్కిన హీరోయిన్ | Kristen Stewart goes on romantic date with Alicia Cargile | Sakshi
Sakshi News home page

గాళ్ ఫ్రెండ్ తో కెమెరాకు చిక్కిన హీరోయిన్

Published Sun, Aug 14 2016 11:31 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

గాళ్ ఫ్రెండ్ తో కెమెరాకు చిక్కిన హీరోయిన్

గాళ్ ఫ్రెండ్ తో కెమెరాకు చిక్కిన హీరోయిన్

లాస్ ఏంజెలెస్: తన గాళ్ ఫ్రెండ్ అలీసియా కార్జిల్ తో కలిసి రొమాంటిక్ లంచ్ కు వెళ్లిన హాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌, 'ట్విలైట్‌' కథనాయిక క్రిస్టన్ స్టివార్ట్ కెమెరాకు చిక్కింది. కార్జిల్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ లాస్ ఫెలిజ్ లోని రెస్టరెంట్ నుంచి స్టివార్ట్ బయటకు రావడం కెమెరా కంటపడిందని పీపుల్స్ మేగజీన్ వెల్లడించింది. స్టివార్ట్ తెలుపురంగు టీషర్ట్, నలుపు జెగ్గింగ్స్ ధరించి మెడలో గొలుసు వేసుకుంది. ఆమె గాళ్ ఫ్రెండ్ కాసువల్ బ్లాక్ టాప్ ధరించి, టోపి పెట్టుకుంది.

తామిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నట్టు గతనెలలో స్టివార్ట్ వెల్లడించింది. కార్జిల్ తో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, ఆమె జీవితంలో మగాళ్లు ఎవరూ లేరని 26 ఏళ్ల 'కేఫ్ సొసైటీ' స్టార్ తెలిపింది. గతంలో గాయని స్టెఫానీ 'సోకో'తో ప్రణయబంధాన్ని స్టివార్ట్ కొనసాగించింది. అంతకుముందు నటుడు రాబర్ట్ పాటిన్సన్‌తోనూ డేటింగ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement