గాళ్ ఫ్రెండ్‌తో ప్రముఖ నటి వివాహం | Kristen Stewart to marry model Stella Maxwell in Southern California | Sakshi
Sakshi News home page

గాళ్ ఫ్రెండ్‌తో ప్రముఖ నటి వివాహం

Published Sun, May 14 2017 8:14 AM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

గాళ్ ఫ్రెండ్‌తో ప్రముఖ నటి వివాహం

గాళ్ ఫ్రెండ్‌తో ప్రముఖ నటి వివాహం

లాస్ ఏంజెలెస్: గత కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్న మహిళా సెలబ్రిటీలు మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. హాలీవుడ్ ప్రముఖ నటి క్రిస్టిన్ స్టెవార్ట్(27), ఐర్లాండ్ మోడల్ స్టెల్లా మాక్స్‌వెల్(26) పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓ పెర్ఫ్యూమ్ ప్రకటన కోసం అర్ధనగ్నంగా ఫొటోలకు పోజులిచ్చి వార్తల్లోకెక్కిన 'పర్సనల్ షాపర్' ఫేమ్ క్రిస్టిన్.. ఆ తర్వాత తన భాగస్వామి ఆడా.. మగా ఎవరో ఇప్పుడే చెప్పలేనంటూ వ్యాఖ్యలు చేసి తన అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే.

గతేడాది నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న క్రిస్టెన్ స్టెవార్ట్, మోడల్ స్టెల్లాలు దక్షిణ కాలిఫోర్నియాలో తమ మ్యారెజ్ ప్లేస్‌గా ఫిక్సయ్యారని కథనాలు వచ్చాయి. పెళ్లిదుస్తులు , ఇతరత్రా సామాగ్రి కోసం షాపింగ్ మొదలుపెట్టారని వీరి సన్నిహితులు చెబుతున్నారు. పెళ్లిని వినూత్నంగా చేసుకోవాలని, సెలబ్రేషన్ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని డిజైనర్లను సంప్రదించారట. తన మాజీ గాళ్ ఫ్రెండ్ అలీసియా కార్గైల్‌తో ప్రేమాయణం నడిపిన నటి క్రిస్టెన్ విభేదాల తలెత్తడంతో బ్రేకప్ చెప్పేసింది. అప్పటినుంచి ఐర్లాండ్ మోడల్‌తో కలిసి ఉంటోంది. తొలుత నటుడు రాబర్ట్ పాటిన్సన్‌తో డేటింగ్ చేసిన క్రిస్టెన్ అతడితో బ్రేకప్ చేసుకుని ఆ తర్వాత సింగర్ స్టెఫానీ 'సోకో'తోనూ ప్రణయబంధాన్ని కొనసాగించింది. చివరికి మోడల్ స్టెల్లానే తన జీవితభాగస్వామి అంటూ ఇటీవల ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement