
మంచు లక్ష్మీ
మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో విజయ్ యెలకంటి దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ అండ్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ ‘వైఫ్ ఆఫ్ రామ్’. సామ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై లక్ష్మీ మంచు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది. ‘‘ఓ ఎన్‌జీవోలో పని చేసే దీక్ష అనే యువతి భర్త హత్యకు గురవుతాడు.
ఆ మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో దీక్ష ధైర్యంగా ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితుల నేపథ్యంలో కథనం సాగుతుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అన్నారు దర్శకుడు విజయ్. ‘‘మంచు లక్ష్మీ కెరీర్‌లో దీక్ష పాత్ర ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దర్శకుడు రాజమౌళి ట్రైలర్‌ను మెచ్చుకోవడం హ్యాపీ. ఒట్టావా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ౖ‘వెఫ్ ఆఫ్ రామ్’ చిత్రాన్ని సోషయల్లీ కాన్షియస్ థ్రిల్లర్‌గా పేర్కొన్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు రఘు దీక్షిత్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment