తాప్సి ప్లేస్లో లావణ్య | lavanya tripathi replaces taapsee | Sakshi
Sakshi News home page

తాప్సి ప్లేస్లో లావణ్య

Published Fri, Feb 12 2016 11:57 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

తాప్సి ప్లేస్లో లావణ్య - Sakshi

తాప్సి ప్లేస్లో లావణ్య

భలే భలే మొగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి వరుస సూపర్ హిట్స్తో మంచి ఫాంలో ఉన్న లావణ్య త్రిపాఠిని మరో క్రేజీ ఆఫర్ వరించింది. తెలుగులో హీరోయిన్గా అడుగుపెట్టిన భామలందరూ తమిళ సినిమా మీద కూడా దృష్టి పెడతారు అయితే లావణ్యకు మాత్రం ఇన్నాళ్లు ఆ అవకాశం రాలేదు. తాజాగా మరో హీరోయిన్ చేయాల్సి పాత్ర మిస్ అయి లావణ్య చేతికి వచ్చింది. ఆ సినిమాతో కోలీవుడ్లో కూడా ఎంట్రీ ఇస్తుంది ఈ బ్యూటి.

తమిళనాట విల్లా, పిజ్జా లాంటి చిత్రాలను అందించిన నిర్మాత సివి కుమార్ తొలిసారిగా దర్శకుడిగా మారుతూ ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హీరోయిన్గా ముందు తాప్సిని ఎంపిక చేశారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో తాప్సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఈ ఆఫర్ లావణ్య చేతికి వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాతో తొలిసారిగా తమిళ తంబిలను పలకరించనుంది లావణ్య త్రిపాఠి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement