వద్దంటే వినవా..! | listen if i say no | Sakshi
Sakshi News home page

వద్దంటే వినవా..!

Published Wed, Mar 25 2015 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

వద్దంటే వినవా..!

వద్దంటే వినవా..!

క్రికెటర్స్ వెంట గాళ్ ఫ్రెండ్స్‌కు ఎలో లేదనడం చూశాం. ఎందుకంటే... కుర్రాళ్లు డేటింగ్ ఆటలో పడి... అసలు ఆట మర్చిపోతారని! మరి సినీ తారలకూ అలాంటి షరతే పెడితే! కొత్తగా ఉంది కదూ! కొత్తగా కాదు... పరమ చెత్తగా ఉందంటోంది హాలీవుడ్ తార కెల్లీ బ్రూక్. ప్రియుడు, సహ నటుడు నిక్ జనోతో రొమాన్స్ చేయవద్దంటూ హుకుం జారీ చేసింది కెల్లీ హోస్ట్ చేస్తున్న ఓ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్.

దెబ్బకు మైండ్ బ్లాకయిన కెల్లీ... ఇదెక్కడి గోలంటూ గోల పెడుతోంది. ‘నిక్‌తో డేటింగ్ చేయకూడదట. దాని వల్ల షోకు ఇబ్బందట. ఇంత కంటే ఘోరమేముంటుంది! అయినా నాకే మంచిది. ఈ ఎడబాటు వల్ల మేం ముద్దు పెట్టుకునే సన్నివేశాలు మరింత సహజంగా వస్తాయి’ అంటూ నెగటివ్‌లోనూ పాజిటివ్ ‘వేవ్స్’ పుట్టించిందీ ముప్ఫై ఐదేళ్ల మోడల్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement