పూరీ మార్క్.. వరుణ్ టెంపర్ తో 'లోఫర్' ట్రైలర్ | loafer trailor released | Sakshi
Sakshi News home page

పూరీ మార్క్.. వరుణ్ టెంపర్ తో 'లోఫర్' ట్రైలర్

Published Mon, Nov 9 2015 11:07 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పూరీ మార్క్.. వరుణ్ టెంపర్ తో 'లోఫర్' ట్రైలర్ - Sakshi

పూరీ మార్క్.. వరుణ్ టెంపర్ తో 'లోఫర్' ట్రైలర్

హైదరాబాద్‌: సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా 'లోఫర్' ట్రైలర్ విడుదల అయింది. పూరీ మార్క్ టైటిల్తో ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ట్రైలర్ మరోసారి పూరీకున్న మాస్ ఎలిమెంట్స్ ను చూపించేలా ఉంది. ఇప్పటికే ఈ సినిమా కథలో తల్లి సెంటిమెంట్ ప్రధానం అని టాలీవుడ్ వర్గాల ద్వారా తెలిసిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా పోసాని సంభాషణలు సినిమాలో ఆకట్టుకునేలా అనిపిస్తుంది. వరుణ్ కు తల్లిగా నటిస్తున్న సీనియర్ నటి రేవతి, వరుణ్ మధ్య ఉన్న సంభాషణలు గుండెను కదిలించేలా ఉన్నాయి. ఇక, ట్రైలర్ మధ్యలో వచ్చిన బిట్ సాంగ్స్ లో కూడా పూరీ మార్క్ స్పష్టం గా కనిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తాలుకు ఫస్ట్ లుక్ ను తాజాగా శనివారం సాయంత్రం విడుదల చేసిన పూరీ సోమవారం ట్రైలర్ ను విడుదల చేసి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసేలా మాత్రం చేశారని చెప్పవచ్చు.

ఇక ట్రైలర్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెంటనే స్పందించారు. ఈ ట్రైలర్ ద్వారా పూరీ మరోసారి సూపర్ ఫామ్ లోకి వచ్చాడని తెలుస్తోందంటూ ట్వీట్ చేశాడు. ఈ చిత్ర ట్రైలర్ ను రకుల్ ప్రీత్ సింగ్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. వరుణ్ మాత్రం ఇంతకుముందు సినిమాలకు భిన్నంగా పూర్తి రఫ్ లుక్ లో కనిపిస్తుండటం ఈసారి మాస్ పీపుల్ తోపాటు నేటి కుర్రకారును కూడా అమితంగా ఆకట్టుకునేలా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement