'లోఫర్' ఫస్ట్ లుక్ సూపర్..
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా 'లోఫర్'. పూరీ మార్క్ టైటిల్తో ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేసిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా శనివారం సాయంత్రం పూరీ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో లోఫర్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. సినిమాకి సంబంధించి నాలుగు పోస్టర్లను పూరీ పోస్ట్ చేశారు. వరుణ్ ఇంతకుముందు సినిమాలకు భిన్నంగా కాస్త రఫ్ లుక్ లో కనిపిస్తున్న ఓ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సీనియర్ ఆర్టిస్ట్ రేవతి, పోసాని కృష్ణమురళి కూడా మరో పోస్టర్లో ఉన్నారు. హీరోయిన్ దిశా పటానితో కలిసి వరుణ్ ఉన్న పోస్టర్స్ అయితే సినిమా మీద యూత్లో క్రేజ్ పెంచటం ఖాయం.
రామ్ గోపాల్ వర్మ కామెంట్ :
లోఫర్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే వర్మ తనదైన శైలిలో స్పందించారు. సూపర్ ఎమోషనల్ ఫస్ట్ లుక్ అని, రేవతి లాంటి సీనియర్ నటిని పూరీ సినిమాలో చూడటం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. పోస్టర్‌లో వరుణ్ వెనుక ఉన్న త్రిశూలానికి, వరుణ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్కు సూపర్ కనెక్షన్ ఉందని చెప్పుకొచ్చారు. మరో పోస్టర్లో హీరో హీరోయిన్లు రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తుండగా, దాన్ని మణిరత్నం - పూరీ జగన్‌ల క్రాస్ బ్రీడ్‌లా ఉందని వ్యాఖ్యానించారు. దానికి పూరీ జగన్నాథ్ కూడా థాంక్యూ సా....ర్... అంటూ సమాధానం ఇచ్చాడు. టైటిల్లోని వైవిధ్యం గురించి కూడా ట్వీట్ చేశారు. ఇంతకుముందు 'లోఫర్' టైటిల్ నాకు నచ్చలేదంటూ వర్మ చెప్పిన విషయం తెలిసిందే.