డియర్ రావణా..
విజయదశమి అయిపోయినా ఇంకా పండుగ మూడ్లోనే ఉన్నట్టున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి నాడు 'రావణ దహనం' చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. దానికి సంబంధించి పూరీ తన ట్విట్టర్లో షేర్ చేసిన ఓ లెటర్ ఆకట్టుకుంటోంది.
డియర్ రావణా.. అంటూ రావణుడిని అడ్రెస్ చేస్తూ ఉన్న ఆ ఉత్తరం లోని చాలా వాక్యాలు కన్విన్సింగ్గా ఉన్నాయి. సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడి తప్పును చూపిస్తూనే ఆయనలోని సద్గుణాలను వివరిస్తూ.. ప్రస్తుత సమాజానికి చురకలు వేయడం ఆసక్తిగా ఉంది. ఈ ఉత్తరం సృష్టికర్త ఎవరోగానీ.. ప్రస్తుతానికి ఈ లెటర్ సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి..
— PURI JAGAN (@purijagan) October 24, 2015