సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..! | Mahesh Babu Maharshi Releasing On 25th April | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 22 2019 6:36 PM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

Mahesh Babu Maharshi Releasing On 25th April - Sakshi

‘భరత్‌ అనే నేను’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తరువాత సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రంపై భారీ​ అంచనాలు నెలకొన్నాయి. మహేష్‌ బియర్డ్‌లుక్‌లో కనిపించబోతోన్న ‘మహర్షి’ చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చేసింది. 

మహర్షి నిర్మాతల్లో ఒకరైన దిల్‌ రాజు ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 25న తేదీన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. మహేష్‌ నటిస్తున్న 25వ చిత్రం కాబట్టే.. ఏప్రిల్‌ 25న విడుదల చేసేందుకు ముహుర్తం ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. పూజా హెగ్డె కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement