
టాలీవుడ్‌లో బడా హీరోల మధ్య సఖ్యత పెరుగుతోంది. ఒకరి ఫంక్షన్లకు మరొకరు హాజరవుతున్నారు. అభిమానులు అందరూ కలిసే ఉండాలనే సందేశాలిస్తున్నారు. రామ్‌చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ముగ్గురు కలిసి చాలా ఈవెంట్స్‌లో పాల్గొనడమే పెద్ద హీరోల మధ్య సఖ్యత పెరుతుందనడానికి నిదర్శనం.
ఇలా హీరోలందరూ కలిసి ఉండటం టాలీవుడ్‌కు మంచి పరిణామమే. ఈ జాబితాలోకి యంగ్ అండ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా చేరిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఇటు మెగాఫ్యామిలీతో కలిసి పోయిన విజయ్.. ఈ మధ్య ప్రిన్స్ మహేష్ బాబును కూడా కలిశాడు. మహేష్ ‘గీత గోవిందం’ను చూసి మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్‌ను కలిసిన ఆనందంతో విజయ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ ట్వీట్‌కు మహేష్ రిప్లై ఇస్తూ..ఇది విజయ్ దేవరకొండకు మంచి సమయమని.. ఇప్పుడు అతని టైమ్ నడుస్తోందంటూ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే హాలిడేను ఎంజాయ్ చేయమంటూ విజయ్‌కు విషెస్ తెలిపాడు. ఈ ట్వీట్‌ను చూస్తే.. పరోక్షంగా హిట్‌ల మీద హిట్‌లు కొడుతున్నావంటూ చెప్పేసినట్టున్నాడు టాలీవుడ్ ప్రిన్స్. మహేష్ ప్రస్తుతం మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Had a really nice time too... Enjoy your holiday @TheDeverakonda... the time is NOW! 😉 https://t.co/ony1NPZ8Kz
— Mahesh Babu (@urstrulyMahesh) August 24, 2018