
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగా తనయుడు రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఒక టీజర్‌తో పాటు, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మరో టీజర్‌ను మంగళవారం ముంబైలో రిలీజ్ చేశారు. భారీ యాక్షన్ విజువల్స్‌లో రూపొందించిన ఈ టీజర్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. పవన్ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో వావ్ అనిపించేలా డిజైన్ చేశారు.
మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కావటంతో రామ్ చరణ్ దగ్గరుండి సినిమా పనులన్ని చూసుకుంటున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.