సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుగు పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ రోజు(శుక్రవారం) ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై స్పందించిన కేసీఆర్ సినిమా షూటింగులు, ప్రిప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని తెలిపారు. (సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వండి)
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు🙏🙏 ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియా కి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2020
వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి అందరికి మేలు కలిగేలా చూస్తుందని హమీ ఇచ్చారని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకు సంబంధించిన సమస్యలపై స్పందించి, వేలాది మంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు చిరంజీవి అన్నారు. తమ సమస్యలను విని, సానుకూలంగా స్పందించినందుకు సీఎం కేసీఆర్‌కు ట్విటర్ వేదికగా మెగాస్టార్ ధన్యవాదాలు తెలిపారు. (సినీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం)
దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి: కేసీఆర్
వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు. I wholeheartedly thank Hon'ble CM #KCR garu on behalf of the Film, TV & Digital Media industries for granting a patient hearing & his kind reassurance.🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2020
Comments
Please login to add a commentAdd a comment