
మిహికా బజాజ్
రానా, మిహికా ఆగస్ట్ 8న ఏడడుగులు వేయబోతున్నారు. ‘‘మేం ప్రేమలో ఉన్నాం’’ అని రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఆ తర్వాత పెద్దలు కలుసుకుని, పెళ్లి ముహూర్తం ఖరారు చేయడం తెలిసిందే. పెళ్లి తేదీ ఖరారు చేయడానికి ఇరు కుటుంబాలు కలిసినప్పుడు ‘రోకా’ ఫంక్షన్ జరిగింది. అయితే ఇది నిశ్చితార్థ వేడుక కాదని దగ్గుబాటి కుటుంబం తెలిపింది. రెండు కుటుంబాలూ ఫార్మల్‌గా కలిశామని చెప్పారు. ఇక పెళ్లి తేదీ దగ్గరపడటంతో రానా, మిహికా ఇంట్లో పెళ్లి పనులు మొదలుపెట్టారు.
ఈ వేడుకల్లో భాగంగా జరిగిన ఓ ఫొటోషూట్‌ని మిహికా షేర్ చేశారు. డిజైనర్ డ్రెస్, డిజైనర్ నగల్లో మిహికా మెరిసిపోయారు. ‘‘ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (పెళ్లికి ముందు జరిగే వేడుకలు) బాగా జరగడానికి కారణం అవుతున్న అందరికీ ధన్యవాదాలు. ఇది నాకు చాలా చాలా స్పెషల్ డే’’ అంటూ ఆ ఫోటోలను పోస్ట్ చేశారు. కాగా, డ్రెస్‌కి మ్యాచింగ్‌గా డిజైనర్ మాస్కులు కూడా తయారు చేయించుకున్నారు మిహికా. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా రానా, మిహికాల పెళ్లి వేదిక అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment