
బుల్లితెరపై మిణుగురులు
‘మిణుగురులు’... గత ఏడాది జనవరిలో రిలీజైన ఈ ఆలోచనాత్మక చిత్రం గుర్తుందా? ఒక అంధుల హాస్టల్‌లో జరిగే అన్యాయాల మీద విద్యార్థులు తిరగబడే ఇతివృత్తంతో ప్రవాస భారతీయుడు అయోధ్యకుమార్ క్రిష్ణంశెట్టి రూపొందించిన సినిమా అది. రెండేళ్ళ క్రితం హైదరాబాద్‌లో జరిగిన ‘అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం’లో లైవ్‌యాక్షన్ కేటగిరీలో పోటీపడిన ఈ సినిమా పలువురు విమర్శకుల ప్రశంసలందుకొంది. పలు అవార్డులందుకొన్న ఈ చిత్రం తొలిసారిగా టీవీలో రానుంది.
ఈ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ‘మా’ టీవీలో ప్రసారమవుతోంది. ‘‘ఇలాంటి చిత్రాల్ని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు తీయాలనే ఉత్సాహం వస్తుంది. ప్రస్తుతం ఆరేడు బౌండ్ స్క్రిప్టులతో ప్రముఖ నటీనటుల్ని కలిశాను. ఈ నెలలోనే కొత్త సినిమా ప్రకటన చేస్తున్నా’’ అని నాలుగేళ్ళ పాటు అమెరికాలో ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీ చేసిన అయోధ్యకుమార్ చెప్పారు.