రాజీవ్ హత్య నేపథ్యంలో...
రాజీవ్ హత్య నేపథ్యంలో...
Published Mon, Feb 24 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యోదంతాన్ని ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారు. మానవ బాంబులనేవి ఉంటా యని చాలామందికి తెలిసింది అప్పుడే. ఈ నేపథ్యంలో మలయాళంలో ‘మెషీన్ 90 డేస్’ చిత్రం రూపొందింది. సూపర్‌స్టార్ మమ్ముట్టి సిట్ అధికారిగా నటించారు. మేజర్ రవి దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘శ్రీ పెరంబదూర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తేలప్రోలు వీరయ్య చౌదరి సమర్పణలో శ్రీ తిరుమల హోం ట్రేడర్స్ పతాకంపై షేక్ మహమ్మద్ హుస్సేన్ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘కథా కథనాలు సంచలనాత్మకంగా ఉంటాయి. అప్పటి సంఘటనలు కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అద్దంకి రాము, మాటలు: భారతీబాబు.
Advertisement
Advertisement